Rajinikanth: అల్లుడు పై ప్రశంసల వర్షం కురిపించిన రజినీకాంత్.. వీడియో వైరల్?

Rajinikanth: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, భార్య ఐశ్వర్య రజినీకాంత్ వారి వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ జంట వారు విడిపోతున్నట్లు జనవరి 17 సోమవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 2004లో పెళ్లి చేసుకుని ఒక్కటయిన ఈ జంట ఆ 18 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే రజినీకాంత్ తన అల్లుడు ధనుష్ పై గతంలో ఒకసారి ప్రశంసల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్న నేపథ్యంలో పాత వీడియోని వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. కాలా సినిమా మ్యూజిక్ లాంచ్ సమయంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తన అల్లుడు ఒక మంచి భర్త, మంచి తండ్రి,మంచి వ్యక్తి అంటూ ఆ వీడియోలో ధనుష్ నిపొగడ్తలతో ముంచెత్తాడు రజనీకాంత్.

 

ఈ జంట వారికి ఇష్టపూర్వకంగా విడిపోతున్నాము అంటూ సంయుక్తంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపుగా 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కలసి పంచుకున్న జంట విడిపోతున్నాము అంటూ ప్రకటించారు. ఈరోజు మన దారులు విడిపోయే ప్రదేశంలో నిలబడి ఉన్నాము. ఐశ్వర్య నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. నాకు ప్రైవసీ ఇవ్వండి అంటూ ధనుష్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి.. మాకు అవసరమైన గోప్యతను మాకు అందించండి.. ఓం నమశ్శివాయ..స్ప్రెడ్ లవ్ డి అంటూ ధనుష్ తన ట్విట్టర్ లో ఒక నోట్ ను షేర్ చేశారు.