తమ విడాకులు గురించి ఆసక్తికర వాక్యాలు చేసిన సుమ!

Anchor suma: బుల్లితెరపై సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమ స్థానంలో ఉంది. తన మాటల గారడీతో ప్రేక్షకులు అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రతి ఇంట్లో మనిషిగా నిలిచిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర మీద యాంకర్ గా వ్యవహరిస్తూ..ఒకవైపు అనేక టీవీ షో లకి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకరింగ్ చేస్తూ, మరొకవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ప్రేక్షకులను అలరిస్తుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో నటించిన సుమ ప్రస్తుతం జయమ్మ పంచాయితీ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమ నటిగా తన సత్తా చూపేందుకు సిద్ధమయ్యింది.

ఎప్పుడు బిజీ గా ఉండే సినిమా పంచాయతీ సినిమా ప్రమోషన్ కోసం ప్రతి షో కి వెళ్లి ప్రమోషన్స్ చేస్తోంది .ఇటీవల జబర్దస్త్ షో కి వెళ్లి హంగామా చేసిన సుమ ఇప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో జాలీగా అనే షో లో సందడి చేసింది. ఈవారం ప్రసారంకాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ షోలో అలి,సుమ మధ్య కొన్ని ఆసక్తికర విషయాల గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆలీ సుమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా అడిగాడు. అయితే కొంత కాలం క్రితం సుమ, రాజీవ్ మధ్య గొడవల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అప్పట్లో ఈ విషయం గురించి సుమ ఇద్దరూ స్పందించలేదు.

కానీ ఆలి ఈ షోలో వారి మద్య జరిగిన గొడవలు, విడాకులు గురించి సుమని అడిగాడు. దీనికి సుమ స్పందిస్తూ..గత ఇరవై మూడు సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య ఎన్నో సార్లు గొడవలు జరిగిన సంగతి వాస్తవమే. విడాకుల విషయానికి వస్తే భార్యాభర్తలుగా విడాకులు తీసుకోవడం చాలా తేలిక కానీ.. తల్లిదండ్రులుగా విడాకులు తీసుకోవడం చాలా కష్టం అని తెలిపింది. ఈ షో ద్వారా వారి మధ్య ఉన్న గొడవల గురించి స్పందించింది. ఇక విడాకుల విషయం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ షో చూడాల్సిందే.