సుకుమార్ కుర్రాళ్లకు డిమాండ్ పెరిగింది

Sukumar associates getting chances in industry

Sukumar associates getting chances in industry

ఒకప్పుడు ఎంతటి స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసినా కూడ ఆ పేరు పెద్దగా ఉపయోగపడేది కాదు. పెద్ద దర్శకులు తమ శిష్యులను రికమెండ్ చేసిన సందర్భాలు కూడ తక్కువే. కానీ సుకుమార్ మాత్రం ఆ పద్దతికి పూర్తిగా విరుద్ధం. తన శిష్యులకు అన్ని అండదండలు అందిస్తున్నారు. సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు. ఆ సినిమాకు సుకుమార్ అన్ని విధాలా అండదండలు అందించారు. సినిమాను వెనకుండి నిలబెట్టింది ఆయనే.

ఆయన బుచ్చిబాబు మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో సుకుమార్ శిష్యులకు ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఏర్పడింది. సుకుమార్ దగ్గర పనిచేశాం, కథ వినండి అంటే హీరోలు వింటున్నారు. నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. బుచ్చి బాబు కాకుండా ఇంకో ముగ్గురు సుకుమార్ శిష్యులు దర్శకులు కానున్నారు. వారిలో ఇద్దరైతే సాయి ధరమ్ తేజ్ కు కథలు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. ఇంకొక అసోసియేట్ వేరొక హీరోకు కథ వినిపించి సినిమా సెట్ చేసుకున్నాడట. ఈ సినిమాలను పెద్ద నిర్మాణ సంస్థలే నిర్మిస్తున్నాయి. మామూలుగా కొత్త దర్శకులకు హీరోలను అప్రోచ్ అవ్వడం అంత ఈజీ కాదు. కానీ సుకుమార్ శిష్యులకు మాత్రం ఈజీనే.