Acharya In America : మెగాస్టార్ చిరంజీవి నుంచి దాదాపు మూడేళ్ళ తర్వాత వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య”. దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ స్ట్రైట్ సినిమా భారీ అంచనాలు నెలకొల్పుకొని రికార్డు రిలీజ్ కి సిద్ధం అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఆల్రెడీ బుకింగ్స్ విదేశాల్లో స్టార్ట్ అయ్యాయి.
మరి ఇక్కడ ఆచార్యుడు దుమ్ము లేపుతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ కేవలం 40 శాతం మాత్రమే థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా వాటి నుంచే ఏకంగా లక్షా 50 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు ఈ చిత్రం అందుకొని కొనసాగుతుంది. ఇది నిజంగా ఒక మంచి స్టార్ట్ అనే చెప్పాలి.
అలాగే సినిమా రిలీజ్ అయ్యే నాటికి అయితే సింపుల్ గా 1 మిలియన్ డాలర్ మార్క్ ని ఈ సినిమా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ సినిమా ఎంత వసూళ్ళని అందుకుంటుందో చూడాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చెయ్యగా కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వాళ్ళు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.