టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఎఫ్3 సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఒకవైపు వెంకటేష్ వరుసగా సినిమాలలో నటిస్తుండగా ఆయనకు వ్యాపారాలు కూడా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ మొత్తం ఆస్తుల విలువ 2100 కోట్ల రూపాయలు అని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న కుటుంబాలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.
తండ్రి నుంచి వారసత్వంగా వెంకటేష్ కు కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం అందుతోంది. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. వెంకటేష్ కు హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలను నిర్మించి రామానాయుడు మంచి పేరును సొంతం చేసుకున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వెంకటేష్ భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. వెంకటేష్ సినిమాలలో ఎక్కువ సినిమాలకు సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఒక్కో సినిమాకు 5 నుంచి 6 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న వెంకటేష్ ఎఫ్3 సినిమాకు మాత్రం భారీ మొత్తం రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. వెంకటేష్ బిజినెస్ మేన్ కావాలని అనుకుని ఊహించని విధంగా హీరో అయ్యారు.
విక్టరీ వెంకటేష్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా విక్టరీ వెంకటేష్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. వెంకటేష్ ఎఫ్3 సినిమాతో సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.