స్టార్ కమెడియన్‌కు గాలం వేసిన బీజేపీ.. త్వరలో పార్టీ తీర్ధం పుచ్చుకుంటారట.. !

రాజకీయాలు సినిమా వాళ్లకు కొత్త ఏమి కాదన్న సంగతి తెలిసిందే.. కానీ అందరికి మాత్రం ఈ రాజకీయాలు కలసి రావన్న నిజం కూడా వారికి తెలిసుండాలి.. అయినా గాని ఒక ట్రైల్ వేస్తే పోలా.. లక్కు బాగుంటే గెలిస్తే గెలుస్తాము లేదంటే లేదు.. ఒకవేళ గెలిచాం అనుకో పదవి గ్యారంటీ.. ఇలా ఎంత మంది అటు రాజకీయాలు, ఇటు సినిమాలు చేస్తూ చేతుల నిండా డబ్బులు సంపాదించడం లేదు అని అనుకునే వారు కూడా లేకపోలేదు..

ఇక పార్టీలో అట్రాక్షన్ పెరగడానికి, పబ్లిసిటీ ఎక్కువ అవడానికి రాజకీయ పెద్దలు కూడా సినిమా వాళ్లను వాడుకుంటారు.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మాత్రం తారల మద్దతు రాజకీయ పార్టీలకు ఎంతో అవసరం ఉంటుంది.. ఇకపోతే ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న చిత్రపరిశ్రమలోని వారంతా తెలుసు.. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టని ఓ కమెడియన్ త్వరలో బీజేపీ తీర్ధం పుచ్చుకో బోతున్నాడటా..

త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండంతో బీజేపీ పార్టీ తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో భాగంగా ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు ను పార్టీలోకి ఆహ్వానిస్తుందట.. ఈయన త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుందట.. ఈమధ్య కాలంలో నటి ఖుష్బూ కూడా కమళంలో చేరింది.. తాజాగా ఈ నటుడు కూడా పార్టీలో చేరితే ఈ స్దానంలో బీజేపీ లాభపడుతుందని అనుకుంటున్నారట..

ఒకప్పుడు డీఎంకే పార్టీ తో పరోక్ష సంబంధాలు నెరిపిన వడివేలు ప్రస్తుతం ఏ పార్టీ కి కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాషాయ కండువా కప్పాలని చూస్తున్న బీజేపీ కోరికకు వడివేలు ఎలా స్పందిస్తారో చూడాలి..