Mahesh-Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా SSMB29. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కనుంది. అలాగే భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని టాక్. అలాగే ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతోందని, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇదివరకే హింట్ ఇచ్చారు.
ఇక సినిమా 2026లో విడుదల కానుందని అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం జర్మనీలో ట్రెక్కింగ్ శిక్షణ తీసుకున్నాడట. అలాగే ఇందులో హాలీవుడ్ యాక్టర్‌లు కూడా భాగం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు మాధవన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ పాత్ర గురించి ఇంకా వివరాలు బయటకు రాలేదు కానీ ఈ పాత్ర మహేష్ బాబు క్యారెక్టర్ తో క్లోస్ లి కనెక్ట్ అవుతుందని టాక్.
రాజమౌళి ఈ సినిమాలో మాధవన్ ను ఒక ఇంటెన్స్ విలన్ లేదా మెంటార్ రోల్ లో ఉపయోగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా భారీ VFX, యాక్షన్ సన్నివేశాలతో గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. మాధవన్ ను ఎంపిక చేయడం ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.