Sri Reddy: తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారని ప్రముఖ నటి శ్రీరెడ్డి వాపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా మా అసోసియేషన్ లో ఉన్న వాళ్లు కూడా స్వయంగా వారే అవకాశాలు రావడంలేదని చెప్పారని శ్రీ రెడ్డి అన్నారు. దాని నివారించాలంటే బయటి నుంచి వచ్చే నటులను కట్టడి చేయాలని దానికి అసోసియేషన్ మాత్రమే కావాలి ఏ పని అయినా కూడా ముందుకొచ్చి దానికి తగిన కృషి చేయాలని చెప్పారు. అలా చేయకపోతే తెలుగు కళామతల్లి ఆర్టిస్టులంతా రోడ్డుమీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అన్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమాలు సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయని ఇప్పుడు అలాంటి సిచువేషన్ లేదని శ్రీ రెడ్డి అన్నారు. ఎప్పుడు హీరో ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ప్రోత్సహిస్తున్నారని హీరోయిన్లకు కూడా తగిన ఇంపార్టెంట్ ని కలిగిన సినిమాలు తీయాలని ఆమె అన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ లో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినవి చాలా తక్కువ అని ఆమె చెప్పారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఒక అల్టిమేట్ హీరో అని, తెలుగు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో పెట్టిన ఒక స్టార్ అని శ్రీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన పేరే చెప్పుకోవాలని శ్రీ రెడ్డి అన్నారు. ఆ తర్వాత ఆ స్థాయి గల వారు ఎవరూ సినీ పరిశ్రమలో లేరని ఆమె చెప్పారు. అన్ని హిట్లు ఇచ్చిన హీరో కూడా ఎవరూ లేరని ఈ రోజుల్లో ఒకటి రెండు హిట్లు వస్తేనే తెగ ఆరాటపడుతున్నారని ఆమె అన్నారు.