సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు.. ఎక్కడంటే..?

మన హిందూ మతంలో పూజలు, పండుగలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వారంలో ఏడు రోజులు కూడా ఒక్కో దేవుడికి ప్రత్యేకమైన రోజుగా భావించవచ్చు. ఈ వారంలో ఏడు రోజులు కూడా ప్రజలు దేవుడి ఆలయాలను సందర్శిస్తూ వారి కోరికలను నెరవేర్చుకోవటానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని దేవాలయాలలో మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే ఆయా దేవుళ్లను దర్శించుకునే అవకాశం ఉంటుంది. వీటిలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఒకటి.

విశాఖపట్నంలో కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఏడాదికి ఒక్కసారి విజయదశమి రోజు మాత్రమే భక్తులకు ప్రవేశం ఉంటుంది. దీంతో విశాఖపట్నంలోని ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా విజయదశమి రోజున భారీగా ఈ ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేరాలని పూజలు నిర్వహిస్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే ఈ అమ్మవారు ఆలయానికి పైకప్పు ద్వారాలు గోపురం ఏమీ ఉండవు. ఇదే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత.

విజయదశమి రోజున స్వర్ణ అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని ప్రజలు దర్శించుకుని గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఎంతో మహిమగల ఈ అమ్మవారిని పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని ప్రజలలో అపారమైన నమ్మకం ఉంది. అందువల్ల ఏడాదికి ఒకసారి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలు విజయదశమి రోజు తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు గుమిగూడి వస్తారు.