Sreeja: చిరంజీవి కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్..?

Sreeja: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు, అతని అభిమానులు, మెగా అభిమానులు సోషల్ మీడియా వరుణ్ తేజ్ కు పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి, తండ్రి నాగబాబు, చెల్లెలు నిహారిక సోషల్ మీడియా ద్వారా వరుణ్ తేజ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూతురు శ్రీజ కూడా వరుణ్ తేజ్ కి ఈ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఎమోషనల్ గా ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ సందర్భంగా శ్రీజ పోస్ట్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్ళని అనిపించుకోలేరు. అందుకే నీకోసం నేను ఉన్నాను. నా బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేశావు.. అంతే కాకుండా నాకు సపోర్ట్ గా కూడా నిలిచావు.. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది.. అంటూ వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ లతో కలిసి దిగిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది శ్రీజ. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే శ్రీజ, భర్త కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇదే విషయాలపై తాజాగా శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ స్పందిస్తూ.. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వాటి గురించి మీడియా ఎక్కువగా ఒక చేస్తోంది అంటూ కళ్యాణ్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల్లో జరిగే వాటిని మీడియాకు చెప్పాల్సిన పని లేదని కళ్యాణ్ దేవ్ అతని స్నేహితుల వద్ద వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇక కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.