హిట్ కొట్టకపోయినా.. క్రేజ్ తగ్గని అందగత్తె

‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. తొలి పరిచయంతోనే బాగా ఎట్రాక్ట్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి అభినయం కూడా కనబరిచింది. అందమైన ఫీచర్స్, అందమైన డాన్సులు.. ఇలా రాఘవేంద్రరావు ఏరి తెచ్చిన అందగత్తెల్లో ఓ అందగత్తె ఈ శ్రీలీల. నో డౌట్.

అయితే, భారీ అంచనాల నడుమ వచ్చిన ‘పెళ్లి సందడి’ అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. కానీ, శ్రీలీల క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది. తొలి సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, పాప టాలెంట్‌కి మెచ్చి అవకాశాలు బాగానే అంది వస్తున్నాయట.

ఆల్రెడీ మాస్ రాజా రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ. దీంతో పాటు, మరో రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట. వివరాలు సరిగ్గా తెలియవు కానీ, ఇద్దరు యంగ్ హీరోల సరసన రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోందట ఆయా సినిమాలతో శ్రీలీల.

హిట్టు కొట్టినా ఆఫర్లు పట్టడం కష్టమైపోతున్నఈ రోజుల్లో కన్నడ భామ శ్రీలీల అదృష్టం బాగున్నట్లే.