Sr NTR Daughter: తాజాగా నందమూరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి మృతి చెందింది. ఈ వార్త ప్రస్తుతం నందమూరి కుటుంబంలో విషాదం నింపింది. నందమూరి తారక రామారావు బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. వారిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు. తాజాగా మృతి చెందిన ఉమామహేశ్వరి నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె. మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఉమామహేశ్వరి గతంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారపక్ష నాయకులు నారా లోకేశ్వరి మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయటంతో ఉమా మహేశ్వరి మీడియా ముందుకు వచ్చింది.
కొంత కాలం క్రితం ఘనంగా కూతురి పెళ్ళి చేసిన ఉమా మహేశ్వరి తాజాగా సోమవారం మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి తరలి వెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకోనున్నాడు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరీ నీ మొదట నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చే వివాహం జరిపించారు. అయితే అతను ఆమెను వేధింపులకు గురి చేయటంతో అతనికి విడాకులు ఇప్పించి తర్వాత కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో ఉమామహేశ్వరి వివాహం జరిపించారు.
ఆత్మహత్య చేసుకున్న ఉమామహేశ్వరి..
ఉమామహేశ్వరి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఉమామహేశ్వరి తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించింది. రాజకీయ విభేదాల వల్ల చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత 25 సంవత్సరాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఉమామహేశ్వరి కూతురి వివాహ వేడుకలో వీరిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇదిలా ఉండగా ఉమామహేశ్వరి ఇలా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి కారణంగా ఈమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈమె మరెన్నో వార్త తెలిసి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఉమామహేశ్వరి మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.