spy thriller : ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం `గ్రే`. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్ మదిరాజు దర్శకత్వం వహించారు. కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా `గ్రే` మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా…
చిత్ర దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ – “ దాదాపు నాలుగు దశాబ్ధాల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని తెలియజేయడానికి మా టీమ్ అందరం ఎంతో గర్విస్తున్నాము. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నాకు ఎంతో సపోర్ట్ అందించిన మా హీరో అరవింద్ కృష్ణకి థ్యాంక్స్…ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ ఎంతో అవసరం. తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను“ అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – “ నాకు యాక్టింగ్ మరియు బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను నటించిన గ్రే సినిమా ట్రైలర్ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. గ్రే నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఋషి సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత రాజ్ మదిరాజు గారితో మరోసారి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో బాస్కెట్‌బాల్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తాను. ఈ లీగ్‌లో నేను హైదరాబాద్ తరపున ఆడుతున్నాను. త్వరలోనే టీమ్‌లో జాయిన్ అవుతాను. గ్రే ఒక అద్భుతమైన సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
హీరోయిన్ ఊర్వశిరాయ్ మాట్లాడుతూ – “ గ్రే అనేది ఒక స్పై ఫిలిం. ఎన్నో ట్విస్టులు టర్నులతో పాటు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ప్రత్యేక ధన్యవాదాలు“ అన్నారు.
నిర్మాత కిరణ్ కాళ్లకూరి మాట్లాడుతూ – “మా అద్వితీయ మూవీస్ బ్యానర్‌లో రూపొందిన మొదటి చిత్రం గ్రే…ఒక మంచి థ్రిల్లర్ మూవీ. సినిమా చూశాక చాలా మంది మధుబాబు షాడో నవల తరహాలో అద్భుతంగా ఉంది అని పొగిడారు. మా టీమ్ అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు“ అన్నారు.