త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయిక లో దాదాపు పన్నెండు ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్నా మూడో సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ మొదలయిన ఈ సినిమా గురించి ఒక న్యూస్ వచ్చింది.

ఈ సినిమాలో మహేష్ బాబు కూతురు సితార కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఓ పాప చుట్టూ సాగుతుందట. ఆ పాప పాత్రలోనే సితార కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే సితార పాత్ర పై మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని వచ్చే సమ్మర్ కి స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.