సోనియా అగర్వాల్ తో ఎస్పీ చరణ్ పెళ్లి.. ఆ కామెంట్ తో రచ్చ రచ్చ.?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఎస్పీ చరణ్ గురించి ప్రేత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రమణ్యం సింగర్ గానే కాకుండా నటుడిగా,నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. కానీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మాత్రం నిర్మాతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయారు. ఆయన తెరకెక్కించిన సినిమాలకు కేవలం ప్రశంసలు మాత్రమే అందాయి. అంతేకాకుండా ఎస్పీ చరణ్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఎస్పీ చరణ్ చేసిన పోస్ట్, చేసిన కామెంట్ ప్రస్తుతం ఈ గందరగోళానికి దారితీసింది. 7/జి బృందావన్ కాలనీ సినిమా హీరోయిన్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతో ఒక ఊపేసిన సోనియా అగర్వాల్ మనందరి గుర్తు ఉండే ఉంటుంది.. సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ కొత్త ప్రయత్నం అంటూ ఎస్పీ చరణ్ కామెంట్ పెట్టడంతో అందరూ కంగ్రాట్స్ అని చెబుతున్నారు. కానీ చాలామంది వారిద్దరి చూసి ఎస్పీ చరణ్ సోనియాల పెళ్లి అని అనుకుంటున్నారు.

 

అప్పుడు వెంటనే ఎస్పీ చరణ్ మరొక పోస్ట్ చేస్తూ ఫిలిం ప్రొడక్షన్, ఇండియన్ వెబ్ సిరీస్ అనే హ్యాష్ ట్యాగ్ లు పెట్టడంతో అసలు విషయం అందరికీ అర్థం అయింది. త్వరలోనే వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని అందుకు సంబంధించిన ఫోటోలు ఈ క్లారిటీ అని అందరికీ అర్థం అయింది. అలా మొత్తానికి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా ఏదో సినిమా కోసం పోస్టు పెడితే దానిని పెళ్లి అనుకొని రూమర్లు క్రియేట్ చేయడం ఒక్కసారిగా ట్రెండ్ గా మారిపోయింది.