పెన్సిల్ ముల్లుపై సోనూసూద్ పేరు… మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభను మెచ్చుకున్న సోనూసూద్

sonusood appreciates madhu micro artist

ప్రస్తుతం ఎక్కడ చూసినా సోనూసూద్ పేరే. ఆపదలో ఉన్నవారికి ముందుగా గుర్తొచ్చే పేరు. ఆయన ఇప్పటికే వందల మందికి ఆర్థిక సాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. దీంతో చాలామంది ఆయన్ను అభిమానిస్తున్నారు. కొందరైతే ఆయన్ను తమ గుండెల్లో దాచుకున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

sonusood appreciates madhu micro artist
sonusood appreciates madhu micro artist

తాజాగా ఓ మైక్రో ఆర్టిస్ట్ పెన్సిల్ మీద సోనూసూద్ పేరు చెక్కాడు. దాన్ని సోనూసూద్ కే గిఫ్ట్ గా ఇచ్చాడు. తెలంగాణలోని తాండూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధుసూదన్… మైక్రో ఆర్టిస్ట్.. పెన్సిల్ పై పలు ఆర్ట్ లను వేస్తుంటాడు. సోనూసూద్ పేదలను ఆదుకోవడం చూసి.. సోనూసూద్ కు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించి.. పెన్సిల్ మీద తన పేరును రాసి గిఫ్ట్ గా ఇచ్చాడు.

sonusood appreciates madhu micro artist
sonusood appreciates madhu micro artist

పెన్సిల్ ముల్లు మీద చిన్నగా సోనూసూద్ పేరును ఇంగ్లీష్ లెటర్లలో రాసి దాన్ని సోనూసూద్ కు చూపించగానే సోనూసూద్ మైక్రో ఆర్టిస్ట్ ను మెచ్చుకున్నారు.

sonusood appreciates madhu micro artist
sonusood appreciates madhu micro artist

మధు.. పెన్సిల్ ముల్లు మీదనే కాదు.. అగ్గిపుల్లపై కూడా రకరకాల ఆకృతులను చెక్కుతాడు. ఆయన ఇప్పటికే మైక్రో ఆర్టిస్టుగా పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.