స్టార్ హీరోల అభిమానుల నడుమ గొడవలు కామన్. ఒకేసారి ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే యుద్ధం మొదలవుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాదులాడుకుంటుంటారు. గతంలో ఈ గొడవలు థియేటరల్ దగ్గరే ఉండేవి. అది కూడ విడుదలైన రెండు మూడు రోజులే. ఆ తర్వాత అంతా మర్చిపోయేవారు. కానీ సోషల్ మీడియా వినియోగం వచ్చాక సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చిన్నా చితకా కారణాలకు కూడ గొడవలు పెట్టేసుకుంటున్నారు. హీరోల కలెక్షన్లనే కాదు వారి పర్సనల్ విషయాలను కూడ చర్చకు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.
అయితే ఈ సోషల్ మీడియా యుద్దానికి అంతనేది లేకపోవడమే ఇక్కడ బ్యాడ్ ఫ్యాక్టర్. ఎప్పుడో జరిగిన గొడవలను కెలుక్కుని మరీ కొత్తగా కొట్టుకోవడం సోషల్ మీడియా వీరులకే చెల్లింది. గత ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ ముందు పోటీపడ్డారు. ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ సినిమాలు పోటాపోటీగా వసూళ్లను సాధించాయి. రెండూ హిట్ అనిపించుకున్నాయి. ఆ టైంలో ఇరు హీరోల అభిమానులు ట్విట్టర్ వార్ గట్టిగా చేశారు. కొన్ని రోజుల వరకు ఆ వార్ నడిచింది. వారి మీద విమర్శలు కూడ పడ్డాయి. మళ్ళీ ఈ గొడవ ఇప్పుడు రాజుకుంది.
కారణం, సందర్భం లేకుండానే అభిమానులు వరస్ట్ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి అసహ్యమైన కామెంట్స్ చేసుకుంటున్నారు. ఈ పని అందరూ చేస్తున్నారని అనలేం కానీ చేస్తున్న ఆ కొంతమంది బ్యాడ్ మైండెడ్ పీపుల్ చేస్తున్నారు. వారి మూలంగానే ఈ నెగెటివిటీ. కాబట్టి నిజమైన అభిమానులు ఈ నెగెటివిటీని తొక్కిపడేసేలా ఏదో ఒకటి చేయాలి.