తాతయ్య పార్థివ దేహం వద్ద వెక్కి వెక్కి ఏడ్చేసిన సితార, గౌతమ్.

ఆప్తులైన వారిని ఒకరి తర్వాత ఒకర్ని కోల్పోతుంటే.. వచ్చే బాధ వర్ణనాతీతం. వరుసగా ఒకే ఇంట్లో మరణాలను తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడంతో.. ఆ కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఆ దు:ఖాన్ని దిగమింగుకుంటూ.. తన తండ్రిని కడసారి చూడటానికి వచ్చిన వారిని మహేష్ బాబు పలకరిస్తున్నారు. తండ్రి పార్థివ దేహం పక్కన మహేష్‌ని చూసిన వారే తల్లడిల్లిపోతుంటే.. ఇక ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక తాతని కడసారి చూసేందుకు వచ్చిన మనవడు గౌతమ్ కృష్ణ, మనవరాలు సితార అయితే వెక్కి వెక్కి ఏడ్చేశారు.

తాజాగా నానమ్మ ఇందిరాదేవి చనిపోయింది.. ఇప్పుడు తాతయ్య కృష్ణ.. ఆ చిన్నారులకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అభిమాన నటుడిని చివరిసారి చూసుకోవడానికి వచ్చిన లక్షలాది మంది అభిమానులు ఒకవైపు.. తాతయ్య పార్థివ దేహం మరో వైపు.. అసలేం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారులను మహేష్, నమ్రత ఓదార్చుతుంటే.. చూస్తున్న జనం కళ్లలో నీళ్లు ఆగడం లేదు. మొన్న నానమ్మ చనిపోయినప్పుడు సితార ఎలా ఎమోషనల్ అయిందో తెలియంది కాదు. మహేష్ బాబు ఒడిలో కూర్చుబెట్టుకుని సితారను ఓదార్చుతున్న తీరుని చూసి అంతా చలించిపోయారు. ఇప్పుడు తాతగారి పార్థిక దేహంపై పూలు చల్లి.. వాళ్లు నమస్కారం చేస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్నవారి పరిస్థితి అదే. మహేష్ బాబు ఫ్యామిలీ సంవత్సర కాలంగా ఎంత దు:ఖంలో మునిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.