సితార క్యూట్ స్మైల్‌కు నెటిజ‌న్స్ ఫిదా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటోలు

లిటిల్ ప్రిన్స్ సితార ఘ‌ట్ట‌మ‌నేని రానున్న రోజుల‌లో మ‌హేష్ బాబు క‌న్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుందా అనే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి త‌ర‌చుగా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుండ‌గా, ఇవి నెటిజ‌న్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా త‌న తండ్రి సినిమాల‌లోని పాట‌ల‌కు సితార చేసే డ్యాన్స్ ఎంతో మంది మ‌న‌సుల‌ని దోచుకుంది. సితార ఇప్పుడు ఏం చేసిన కూడా అది వైర‌ల్‌గా మారుతుంది.

మ‌హేష్‌, న‌మ్ర‌త‌ల ముద్దుల కూతురు సితార కొద్ది రోజుల క్రితం వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి ఏ అండ్ ఎస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఇందులో అనేక విష‌యాల‌ను తెలియ‌జేస్తూ వీక్ష‌కుల‌కి మంచి వినోదం అందించింది. ఇక అడ‌పాద‌డ‌పా టూర్ ఫొటోస్ లేదంటే త‌న ఫ్యామిలీతో క‌లిసి చేసే సంద‌డికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌ను అందిస్తూ వ‌స్తుంది సితార‌. 3డీ యానిమేషన్‌ వెబ్‌ సిరీస్‌ కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మారింది ఈ చిన్నారి. ఇటీవ‌ల ఈ వెబ్‌ సిరీస్‌ పోస్టర్‌ను మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు.

న్యూ ఇయ‌ర్ లో సితార తన సోష‌ల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ త‌న ఫ్యాన్స్‌తో పాటు మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఆనందింప‌జేస్తుంది. తాజాగా పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో క్యూట్ స్మైల్ ఇస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఇందులో సితార ఓ ఎంజెల్‌లా కనిపిస్తుంది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.