Sitara Gattamaneni : మహేష్ కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా? వైరల్ గా మారిన వీడియో.!

Sitara Gattamaneni : టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఇక దీనితో పాటుగా మహేష్ బాబు మరిన్ని భారీ సినిమాల్లో చేయనున్నాడు. అయితే సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం మహేష్ బాబు ఓ రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.
ముఖ్యంగా తన ఫ్యామిలీ కూడా అదిరే ప్రమోషన్స్ ఈ సినిమాకి చేస్తున్నారు. అలా ఈ సినిమా నుంచి థమన్ ఇచ్చిన రెండో సాంగ్ పెన్నీ కి గాను మహేష్ కూతురు సితార ఘట్టమనేని ని దింపి కావాల్సిన దానికన్నా ఎక్కువ హైప్ ని తెచ్చేసుకున్నారు.
దీనితో ఈ సాంగ్ టాలీవుడ్ లో ఒక బెస్ట్ సాంగ్ గా నిలిచింది(ప్రస్తుత ట్రెండ్ లో).
ఇదిలా ఉంటే ఆ సాంగ్ లో మంచి స్టైలిష్ గా కనిపించిన సీతారాలో మరో కొత్త యాంగిల్ ని మహెహ్ బాబు పరిచయం చేసాడు. అప్పుడు స్టైలిష్ వెస్ట్రన్ డాన్స్ మాత్రమే కాదు మన దేశ గొప్ప నృత్య కళ అయినటువంటి కూచి పూడి కూడా చేస్తుంది అని తెలిపారు.
అది కూడా తన ఫస్ట్ పెర్ఫామెన్స్ అంటూ ఓ వీడియోని మహేష్ బాబు షేర్ చేసాడు. అందులో సితార నిజంగా ముఞ్చి ప్రదర్శన ఇచ్చింది అని చెప్పాలి. దీనితో ఇది చూసిన వారు అంతా సితార లో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే దీనితో ఈ వీడియో వైరల్ అవుతుంది.
https://twitter.com/urstrulyMahesh/status/1513011736777216004?s=20&t=ATowFO9dp80OoZpGbX0ygQ