Siri Mother: సిరిని అలా అన్నందుకు ఎమోషనల్ అయిన సిరి మదర్ శ్రీదేవి.. ఓదార్చిన నాగార్జున!

Siri Mother: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లు అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ పేరెంట్స్ కూడా హాజరయ్యారు. ఇలా ఈ కార్యక్రమం మొదలవగానే నాగార్జున ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా మాజీ కంటెస్టెంట్ లో అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వేదిక పైకి వచ్చారు. ఈ క్రమంలోనే నాగార్జున వారిని ఎవరు గెలుస్తారు అని అడిగినప్పుడు చాలామంది శ్రీరామచంద్రకి ఓట్లు వేశారు.

ఈ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ పేరెంట్స్ కూడా తమదైన శైలిలో మాట్లాడారు. ఇకపోతే ఈ సందర్భంగా సిరి మదర్ శ్రీదేవి మాట్లాడుతూ బిగ్ బాస్ వేదికపై కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా సిరి మదర్ శ్రీదేవి మాట్లాడుతూ తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సిరి తో మాట్లాడిన మాటల వల్ల తనని చాలా మంది తిట్టారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సిరి గేమ్ ఎంతో చక్కగా ఆడుతుంది కానీ షణ్ముక్ తో హగ్గులు నచ్చడం లేదు అంటూ ఆమె చెప్పిన తర్వాత చాలామంది తనని పెట్టారని ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు.

నేను సిరిని తప్పు బట్టాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ ఆమె ఎమోషనల్ అవ్వడంతో నాగార్జున ఆమెను ఓదారుస్తూ ఒక కూతురికి తల్లి కాకుండా మరి ఎవరు చెబుతారు అంటూ ఆమెను ఓదార్చారు మీ మనసులో ఏముందో అదే విషయాన్ని మీ కూతురితో చెప్పారు అందులో తప్పులేదని నాగార్జున సిరి తల్లిని ఓదార్చారు