Single Cinema Hot Sensation : సింగిల్ సినిమా సెన్సేషన్: కనిహ గురించి మీకు తెలుసా.?

Single Cinema Hot Sensation

Single Cinema Hot Sensation : ‘ఒట్టేసి చెబుతున్నా..’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నిమెస్మరైజ్ చేసిన బ్యూటీ కనిహ. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు దివ్య సుబ్రహ్మణ్యమ్. అయితే తమిళ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.

శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘ఒట్టేసి చెబుతున్నా’ సినిమా కోసం కనిహ అప్పట్లోనే బోలెడంత రెమ్యునరేషన్ అందుకుందట. అప్పట్లో ఆమె రెమ్యునరేషన్ టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. కూడా. ఆ తర్వాత ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ సినిమాలో క్లైమాక్స్‌లో తళుక్కున మెరిసింది.

బిట్స్ పిలానీలో ఉన్నత చదువులు అభ్యసించిన కనిహ, అనుకోకుండా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ, తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లో చాలా ఎక్కువ సినిమాల్లో నటించింది అందాల భామ కనిహ.

కేవలం నటి మాత్రమే కాదు కనిహ. సింగర్ కూడా రెండు, మూడు తమిళ సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా పని చేసింది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేసింది. బుల్లితెరపై పలు సీరియల్స్‌తో ఆకట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, కనిహ టాలెంట్ చిట్టా చాలా పెద్దదే.

ఇక, ఇప్పుడు తెలుగులో మళ్లీ సత్తా చాటాలనుకుంటోందట. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోందట. మంచి ఛాన్స్ వస్తే ఈ సారి తెలుగులో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, తన టాలెంట్‌తో తెలుగు తంబీల మన్ననలు పొందాలనుకుంటోందట కనిహ.