నితిన్ కి రాఖీ కట్టిన సింగర్ మంగ్లీ.. భారీ కానుకలు ఇచ్చిన నితిన్?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేస్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సింగర్ మంగ్లీతో కలిసి ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మంగ్లీ నితిన్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ అనంతరం మంగ్లీ హీరో నితిన్ కు రాఖీ కట్టి ఆయనకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగ్లీ నితిన్ కు రాఖీ కట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో హీరో నితిన్ కూడా భారీగా తనకు గిఫ్ట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఈయన మొదటిసారిగా ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమాలో రారా రెడ్డి అంటూ సాగిపోయే ఐటమ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది.