“ఆచార్య” నుంచి ఆసక్తికరంగా, అంచనాలు పెంచేలా ‘సిద్ధ’ టీజర్.!

రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మరియు మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేసిన మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర చేస్తున్నాడు.

మరి దీనిపైనే చిత్ర బృందం ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇది మాత్రం సినిమాపై మరింత ఆసక్తి పెంచేదిలా ఉందని చెప్పాలి. ముఖ్యంగా దీనిలో చరణ్ పై చూపించిన యాక్షన్ బ్లాక్ లు కొరటాల చూపించిన విజువల్ అదిరిపోయాయి. ఇక లాస్ట్ లో షాట్ అయితే చిరు, చరణ్ లపై చూపింది అదిరిపోయింది..

అలాగే లాస్ట్ టైం చిరు టీజర్ లో మ్యాజిక్ చేసిన డి ఓ పి తిరు సిద్ధ టీజర్ లో కూడా అదరగొట్టే విజువల్స్ ఇచ్చారు. అలాగే మణిశర్మ మ్యూజిక్ కూడా ఇందులో రిపీట్ అయ్యింది. ఓవరాల్ గా మెగాస్టార్, మెగాపవర్ స్టార్ ల బ్లాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వరకు ఆగాల్సిందే.