రొమాంటిక్ వైబ్స్‌లో ‘శ్యామ్ సింగరాయ్’

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఏదో ఒక అప్టేట్ వస్తూనే ఉంది. దసరా కానుకగా ఈ సినిమాలో నాని డబుల్ రోల్ లుక్ రివీల్ చేయగా, తాజాగా రిలీజ్ అయిన మరో లుక్ రొమాంటిక్ అప్పీల్ క్రియేట్ చేస్తోంది. నాని – సాయి పల్లవి జంట ఆల్రెడీ ‘ఎమ్‌సీఏ’ సినిమాలో మ్యాజిక్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయనుందనడానికి సింబాలిక్‌గా ఉందీ లేటెస్ట్ లుక్.

సాయి పల్లవిని కళ్లలోకి కళ్లు పెట్టి నాని చూస్తున్న ఈ లుక్‌కి నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని డబుల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చమైన బెంగాలీ కుర్రోడిలా ఓ లుక్‌లో కనిపించబోతున్నాడు నాని.

సాయి పల్లవితో పాటు, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. క్రిస్మస్ కానుకగా, డిశంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మిక్కీ జె. మేయర్ ఈ ‘శ్యామ్ సింగారాయ్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.