Shyam Singha Roy : వైరల్ : మెగాస్టార్ ఇంట “శ్యామ్ సింగ రాయ్” వీడియో వైరల్.!

Shyam Singha Roy : రీసెంట్ గా టాలీవుడ్ దగ్గర మంచి హిట్ గా నిలిచిన చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా అలాగే లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. నాని కెరీర్ లోనే అధిక బడ్జెట్ తో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించాడు.

అయితే పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కి ఈ సినిమా సాలిడ్ హిట్ అయ్యింది. మరి సినీ ప్రముఖులలో కూడా సినిమా మంచి ఆదరణ దక్కించుకోగా రీసెంట్ గా మెగా అప్లాజ్ ఈ సినిమాకి మరియు నాచురల్ స్టార్ కి దక్కింది. ఇంతకుముందు ఏ సినిమాలు చూసినా సోషల్ మీడియాలో పంచుకొని ఆ సినిమా కోసం చెప్పేవారు.

కానీ శ్యామ్ సింగ రాయ్ ఎంత నచ్చిందో కానీ స్వయంగా నానీని తన ఇంటికి పిలిపించుకొని బొకే ఇచ్చి మరీ కంగ్రాట్యులేట్ చేశారు. వారి ఇంటి దగ్గరే ఉండి చిరు మరియు తన భార్య సురేఖ వాణిలతో కూర్చొని నాని కూడా ముచ్చటించాడు. మరి దీనిని శ్యామ్ సింగ రాయ్ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు వీడియో రిలీజ్ చేసి రివీల్ చెయ్యగా అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..