Chiranjeevi: ఇకపై ఎవరు ప్రభుత్వం పై కామెంట్ చేయకండి.. సీఎం భేటీ అనంతరం చిరు షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం మధ్య టిక్కెట్ల రేట్లపై పెద్ద యుద్ధం జరిగిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వీరికి దీటుగా వైసీపీ మంత్రులు కూడా సినీ ప్రముఖులపై ఘాటు విమర్శలు చేశారు. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగిందని చెప్పాలి.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి పులిస్టాప్ పెట్టడం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి నిన్న అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానం ద్వారా విజయవాడకి చేరుకొని అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. సుమారు 20 నిమిషాలు భేటీ అనంతరం చిరంజీవి తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఏదో మంచి చేయాలనే ఆలోచనలోనే ఉందని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నింటిని ముఖ్యమంత్రిగారు ముందు ఉంచితే ఆయన సానుకూలంగానే వ్యవహరించారని,తాను అందరినీ సమదృష్టితో చూస్తానని ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పని లేదని మెగాస్టార్ చిరంజీవికి భరోసా ఇచ్చినట్లు తెలిపారు.ఇక ఏపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో 35 గురించి పునరాలోచన చేస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు మీడియా సమావేశంలో చిరంజీవి తెలియజేశారు.ప్రభుత్వం ఇండస్ట్రీకి సానుకూలంగానే వ్యవహరిస్తుందని ప్రభుత్వం నిర్ణయం చెప్పే వరకు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్ చేయొద్దు అంటూ సినీ పెద్దలకు చిరంజీవి మీడియా సమావేశంలో తెలియజేశారు.