మంచు మనోజ్ పెళ్లి మొదట ఆవిడతోనే జరగాలి?

మంచు మనోజ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తన భార్యతో విడాకుల తర్వాత మనోజ్ మీడియా కి, సినిమాలకి దూరంగా ఉంటున్నాడు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మనోజ్ నుండి మరో సినిమా రాలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా మొదలు పెట్టాడు కానీ ఆ సినిమా మీద ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

అయితే గత కొంత కాలంగా మనోజ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మధ్య భూమా మౌనిక తో అన్యోన్యంగా కనిపిస్తున్నాడు మనోజ్. వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పటికే మనోజ్, అలాగే మౌనిక కి కూడా మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనోజ్, మౌనిక ఇంతకుముందే పెళ్లి చేసుకోవాలంటే, కానీ ఇద్దరి కులాలు వేరే కావడం వలన అప్పుడు పెళ్లి కాలేదు.

కానీ ఈసారి తన తండ్రి, కుటుంబసభ్యులు నివారించినా మనోజ్ మౌనిక ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై మనోజ్, కానీ మౌనిక కానీ ఇంకా స్పందించలేదు.