Star Heroine : షాకింగ్ : సౌత్ ఇండియా ఈ స్టార్ హీరోయిన్ కి కూడా కరోనా పాజిటివ్.!

Star Heroine : ప్రస్తుతం భారతదేశంలో కరోనా మూడో వేవ్ కల్లోలం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. జస్ట్ రోజుల్లోనే పెరుగుతున్న ఈ భారీ లెక్కలే చెబుతున్నాయి. మూడో వేవ్ ఏ స్థాయిలో విస్తరిస్తుంది అనేది. అయితే ఈ వేవ్ ఎంటర్ కావడంతోనే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో స్టార్ట్ అయ్యింది.

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అదుపు లోనే ఉన్నా మన టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మాత్రం ఉగ్ర రూపం కనబరుస్తుంది అని చెప్పాలి. జస్ట్ ఈ రెండు రోజుల్లో టాలీవుడ్ లో అనేకమంది స్టార్స్ కరోనా బారిన పడగా ఇప్పుడు దక్షిణాదికి చెందిన మరో బిగ్ స్టార్ట్ హీరోయిన్ తనకి కరోనా వచ్చినట్టు తెలిపింది.

ఆమె మరెవరో కాదు త్రిష కృష్ణన్. త్రిష కోసం తెలియని వారు ఉండరు. మరి ఇపుడు ఆమెనే తనకి కరోనా వచ్చి కోలుకుంటున్నట్టు తెలిపింది. ఆల్రెడీ తాను వాక్సిన్ వేయించుకున్నానని అయినా కూడా కరోనా కొన్ని రోజులు కితమే వచ్చింది అని చెప్పింది.

ఇంకా ఇప్పుడు వాక్సిన్ వేసుకోడం వల్ల కాస్త రికవర్ అవుతున్నానని అందుకే ఇప్పుడు అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని రిక్వెస్ట్ చేసింది. అలాగే త్వరలోనే ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపింది.