షాకింగ్ : “సర్కారు వారి పాట” పై విపరీతమైన నెగిటివిటీ.!

sarkaru vaari paata : దాదాపు రెండేళ్ళకి పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న రోజుకి ఈరోజు తెర పడింది. దర్శకుడు పరశురామ్ పెట్లతో ప్లాన్ చేసిన “సర్కారు వారి పాట” అనే ఈ సినిమా భారీ స్థాయిలో ఈ రోజు విడుదల అయ్యింది. అయితే మన స్టార్ హీరోల సినిమాలకి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ఫస్ట్ డే దక్కుతాయి.

అలాగే ఇప్పుడు సర్కారు వారి పాట కి కూడా ఆ హంగామా గట్టిగానే నడుస్తుంది. అయితే కాసేపు ఆఫ్ లైన్ టాక్ పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాపై దారుణంగా నెగిటివ్ టాక్ మరియు ట్రెండ్ స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ డిజాస్టర్ సర్కారు వారి పాట అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండగా..

మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ సినిమాకి పెద్దగా బుకింగ్స్ లేవు అంటూ గో గ్రీన్ విత్ సర్కారు వారి పాట అనే ఇంకో ట్యాగ్ తో ఇతర హీరోల అభిమానులు గట్టిగా టార్గెట్ చేస్తూ షాకిచ్చారు. అయితే మొన్న ఆచార్య ఎఫెక్ట్ కూడా ఇది అయ్యి ఉండొచ్చని చెప్పాలి.

మొత్తానికి అయితే సర్కారు వారి పాట పరిస్థితి ఇలా ఉంది. దీనితో సినిమాకి మరింత దెబ్బ పడే అవకాశం అయితే ఉంది. మరి వీటిని దాటి మహేష్ ఈ సినిమాతో మంచి విజయాన్ని నమోదు చేస్తాడో లేదో చూడాలి. ఇంకా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా నదియా, సముద్రఖనిలు కీలక పాత్రల్లో నటించారు.