Divorce : షాకింగ్ : సౌత్ ఇండియా నుంచి మరో బిగ్ స్టార్ జంట విడాకులు.!

Divorce : ఇప్పుడు మళ్ళీ మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఒక ఆకస్మిక వార్త మళ్ళీ కలకలం రేపుతోంది. గత కొన్నాళ్ల కితమే మన టాలీవుడ్ నుంచి స్టార్స్ అయినటువంటి అక్కినేని నాగ చైతన్య మరియు సమంతా లు విడాకులు తీసుకోవడం ఊహించని షాక్ గా నిలిచింది.

వీరు విడిపోతేనే అంతా ఏమో అనుకున్నారు. బాగానే ఉన్నారు పైగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎందుకు విడిపోయారా అని. కానీ ఇప్పుడు ఇంతకు మించిన షాక్ కోలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ హీరో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మరియు తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ లు షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి ధనుష్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు.

తాము విడాకులు తీసుకుంటున్నామని ఇక నుంచి ఎవరి దారుల్లో వారు నడవాలని కోరుకుంటున్నామని తెలిపాడు. దీనిపై ఒక ఎమోషనల్ ప్రెస్ నోట్ ని కూడా ధనుష్ రిలీజ్ చేసాడు. 18 ఏళ్ళు ఒక ఫ్రెండ్స్ గా, భార్యాభర్తలుగా, తల్లిదండులుగా కలిసి ఉన్నాము కానీ ఇప్పుడు ఇద్దరం కూడా ఒకరి అంగీకారంతో ఇంకొకరం విడిపోయి జీవించడానికి సిద్ధం అయ్యాము.

దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి అని ధనుష్ తెలియజేసాడు. దీనితో ఇప్పుడు ఊహించని డివోర్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచి వైరల్ అవుతుంది. వీరికి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఎందుకు తీసుకున్నారో అనే ప్రశ్న ఇప్పుడు వారి అభిమానులను మరింత వేధిస్తుంది.