Sai Pallavi : ‘పుష్ప’ సినిమా కోసం సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్లో సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏ నోట విన్నా ఈ పాట ఊసే. అయితే, ఈ పాటపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే, సాయి పల్లవి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా, స్పెషల్ సాంగ్ చేసే అవకాశం సాయి పల్లవికి వస్తే ఏం చేస్తుంది.? అనే క్వశ్చన్ రైజ్ అయ్యింది.
అందుకు సాయి పల్లవి.. ‘నాకు డాన్స్ అంటే ఇష్టం. కానీ, డాన్స్ చేయడం వేరు, స్పెషల్ సాంగ్‌లో డాన్స్ చేయడం వేరు. స్పెషల్ సాంగ్ చేయాలంటే, స్కిన్ షో తప్పనిసరి. స్కిన్ షోలో నేను కంఫర్ట్‌గా ఉండలేను. సో, కాజల్, తమన్నా, సమంత తదితర హీరోయిన్లు మాదిరి నేను స్పెషల్ సాంగ్స్‌లో నటించలేను..’ అని కుండ బద్దలు కొట్టేసింది.
గతంలో సాయి పల్లవి ‘ఢీ’ షోలో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఢీ షో అంటే అన్ని రకాల డాన్సులూ చేయాల్సిందే. అందులో భాగంగా ఐటెం సాంగ్స్‌కీ డాన్స్ చేయాల్సి వస్తుంది. అదే విషయం సాయి పల్లవిని అడిగితే, ఢీ షోలో ఫుల్‌గా కవర్ చేసుకుని డాన్స్ చేశాను. కానీ, సినిమాల్లో ఐటెం సాంగ్ కోసం అలా చేయడం కుదరదు. సో, అది నాకు కంఫర్ట్ కాదు.. అని తెగేసి చెప్పేసింది.
ఈ రోజుల్లో స్పెషల్ సాంగ్ అంటే కొందరు హీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అందుక్కారణం నిర్మాతలు ఆఫర్ చేస్తోన్న భారీ రెమ్యునరేషన్. అయితే, సాయిపల్లవికి కొన్ని రిజర్వేషన్స్ వున్నాయ్ సినిమా విషయంలో. అంతే తప్ప, ఆమె ఇతర హీరోయిన్లను కించపర్చిందని అనుకోవడానికి వీల్లేదేమో. కానీ, సమంత తదితర హీరోయిన్ల అభిమానులు మాత్రం, సాయి పల్లవి కామెంట్స్ మీద తెగ గుస్సా అయిపోతున్నారు.