షాకింగ్ న్యూస్ : బాలయ్య లేడీ విలన్ కి సోకిన కరోనా వైరస్..!

Varalaxmi Sarathkumar Birthday Wishes To Radhika

గత రెండేళ్లు కూడా ఏ మానవుడు మర్చిపోలేని సంవత్సరాలు అని చెప్పాలి. కంటికి కనిపించని ఈ ప్రమాదకర వైరస్ ఎన్నో లక్షల మందికి బలికొంది. మరి అలాగే దీని వల్ల అధికంగా నష్టపోయిన ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీనే అని కూడా చెప్పాలి.

అనేక మంది స్టార్స్ కూడా దీని మూలాన ప్రాణాలు కోల్పోవడంతో తీరని విషాదమే నెలకొంది. మరి ఫైనల్ గా అంతా చక్కబడుతుంది అనుకుంటే మళ్ళీ మెల్లగా నాలుగో వేవ్ విస్తరిస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ ప్రముఖ నటీనటులకు ఈ ప్రాణాంతక వైరస్ సోకడం మొదలయ్యింది.

తాజాగా ప్రముఖ స్టార్ నటి సౌత్ సెన్సేషన్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా పాజిటివ్ అయ్యినట్టుగా ప్రకటించారు. ఈ వైరస్ ఇప్పుడు తనకి సోకింది అని నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి అని తెలిపింది.

ఇంకా ఇప్పుడు ఈ వైరస్ ఇంకా పోలేదు సినిమా వాళ్ళు కూడా మాస్క్ లు తప్పకుండ ధరించాలని తెలిపింది. ఇక ప్రస్తుతం అయితే ఈమె బాలయ్యతో విలన్ గా దర్శకుడు గోపీచంద్ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుంది. అలాగే మరో భారీ పాన్ ఇండియా సినిమా “హనుమాన్” లో కూడా విలన్ గా నటిస్తుంది.