మెగాస్టార్ ఇంద్ర సినిమాలో ఇంత పెద్ద తప్పా.. ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?

చిరంజీవి హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఫ్యాక్షన్ సినిమాలలో నటించడం ఇష్టం లేకపోయినా కథ నచ్చడంతో చిరంజీవి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. అయితే ఈ సినిమాలో ఒక పెద్ద తప్పు ఉంది. సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత ఈ తప్పు వెలుగులోకి రావడం గమనార్హం.

ఈ సినిమాలోని సెకండాఫ్ లో చాలా సన్నివేశాలను చిరంజీవి డైరెక్ట్ చేశారు. బి.గోపాల్ అల్లరి రాముడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటంతో చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారు. వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న చిరంజీవికి ఈ సినిమాతో కోరుకున్న సక్సెస్ దక్కింది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఒకే సమయంలో హోళీ పండుగ, రాఖీ పండుగ జరుగుతున్నట్టు చూపించారు.

వాస్తవానికి ఈ రెండు పండుగలు ఒకే సమయంలో రావు అనే సంగతి తెలిసిందే. సాధారణంగా హోళీ పండుగను మార్చి నెలలో జరుపుకుంటే ఆగష్టు నెలలో రాఖీ పండుగను జరుపుకుంటాం. అయితే సినిమాలో ఈ తప్పును గుర్తించిన మేకర్స్ కొన్నిరోజుల తర్వాత ఆ తప్పును సరి చేశారు. ఇంద్ర సినిమా అప్పట్లో దాదాపుగా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అటు చిరంజీవికి ఇటు బి.గోపాల్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. నిర్మాతలకు కూడా ఈ సినిమా సక్సెస్ తో కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి. ఒకప్పుడు దర్శకుడిగా వరుస విజయాలను సొంతం చేసుకున్న బి.గోపాల్ ప్రస్తుతం సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. మస్కా సినిమా తర్వాత ఈ డైరెక్టర్ కు మరే స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు.