కృష్ణ పెద్ద కర్మలో 32 రకాల వంటకాలు.. వీటికైనా ఖర్చు ఎంతో తెలుసా?

నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే తీవ్ర అనారోగ్యం కారణాలతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే
సూపర్ స్టార్ కృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 350 పైగా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించి తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ ఎనలేని సేవలు అందించి ఇండస్ట్రీ అభివృద్ధికి తన వంతుగా చేసిన సేవలు పదికాలాలపాటు పదిలంగా ఉంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు, కృష్ణ అభిమానులు ,తెలుగు ప్రజలు కృష్ణ గారి మృతిని జీర్ణించుకోలేక శోకసముద్రంలో మునిగిపోయి కృష్ణ గారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మను హైదరాబాదులోని జేఆర్సి ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘటంనేని ఫ్యామిలీతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినరాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు, దాదాపు 5,000 మంది పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి కృష్ణ గారికి సాంప్రదాయబద్ధంగా నివాళులు అర్పించారు.

కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు, అభిమానులకు మహేష్ బాబు ఘనంగా విందు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథులకు, తెలుగు ప్రజలకు రెండు మాంసాహార వంటకాలతో పాటు పలు రకాల స్వీట్లు శాకాహార వంటకాలను జేఆర్సీ ఫంక్షన్ హాలు వారే తయారు చేసారు. మహేష్ బాబు ఈ కార్యక్రమానికి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మొదట ఘట్టమనేని ఫ్యామిలీ కృష్ణ గారి పెద్దకర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చేసుకున్న తర్వాత జేఆర్సి ఫంక్షన్ హాల్లో ప్రజలందరితో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.