ఈ వారం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉన్న చిత్రాలు “బింబిసార” మరియు “సీతారామం” చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ లో రిలీజ్ కాబోతుండగా ఆడియెన్స్ లో ఆసక్తి పెంచే విధంగా మేకర్స్ అనేక ప్రమోషన్స్ ని చేస్తున్నారు.
మరి ఇప్పుడు ఈ సినిమాలపై ఓ షాకింగ్ టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రాల్లో కళ్యాణ్ రామ్ నటించిన అందులోని మన తెలుగు హీరో పెద్ద ఫ్యామిలీ హీరో సినిమా అయినటువంటి “బింబిసార” కి 15 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరగ్గా బై లాంగ్వేజ్ సినిమాగా వస్తున్న “సీతా రామం”.
అందులోని మలయాళ హీరో తెలుగులో పెద్దగా మార్కెట్ కూడా లేదు సింపుల్ లవ్ స్టోరీ డ్రామా అయినా కూడా ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ సినిమా కంటే అధిక బిజినెస్ జరిగినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం ప్రకారం అయితే సీతా రామం కి ఏకంగా 18 కోట్లు జరిగిందట.
దీనితో ట్రేడ్ వర్గాల్లో ఈ టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఓ భారీ సినిమాకి మించి ఇలాంటి సినిమాకి అందులోని ఇప్పుడున్న పరిస్థితిల్లో జరగడం షాకింగ్ అనే చెప్పాలి. ఇక కళ్యాణ్ రామ్ సినిమాకి అయితే యంగ్ దర్శకుడు వశిష్ఠ వర్క్ చేయగా సంయుక్త మీనన్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మరో సినిమాకి హను రాఘవపూడి డైరెక్షన్ చేయగా మృణాల్, రష్మికా మందన్నా లు హీరోయిన్స్ గా నటించారు.