టాలీవుడ్ నుంచి రానున్న ఈ రెండు వారాల్లో అయితే రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో అఖిల్ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏజెంట్” కూడా ఒకటి.
కంప్లీట్ గా హాలీవుడ్ హంగులతో తెరకెక్కించిన ఈ సినిమాని మొదటి నుంచి చూసినప్పుడే ఖచ్చితంగా హై బడ్జెట్ అయ్యి ఉంటుంది అని అందరికీ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ అసలు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది లేటెస్ట్ గా నిర్మాత అనీల్ సుంకర రివీల్ చేశారు.
ఈ సినిమాకి ఓవరాల్ గా ఏకంగా 80 కోట్ల మేర బడ్జెట్ అయ్యింది అని రివీల్ చేశారు. అయితే ఇది అఖిల్ లాంటి హీరోకి చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. అలాగే తాను మరో ఇంట్రెస్టింగ్ అంశాన్ని కూడా రివీల్ చేయడం మరింత షాకింగ్ గా మారింది.
ఈ సినిమాకి అఖిల్ గాని సురేందర్ రెడ్డి కానీ తమ రెమ్యునరేషన్ లు తగ్గించకుండా ఉండి ఉంటే సినిమా బడ్జెట్ 100 కోట్లకి వెళ్ళేది అని తెలిపారు. ఇది మరో షాకింగ్ అంశం అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోకి 100 కోట్లు బడ్జెట్ తో చిన్న మేటర్ ఏమి కాదు. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే తప్ప ప్రొడ్యూసర్ గా తాము తీసిన ప్రోడక్ట్ పరంగా హ్యాపీగా ఉండలేరు. మరి అఖిల్ ఏజెంట్ ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.