Sad News In Tollywood : ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్నటువంటి పలు ఊహించని సంఘటనలు కలకలం రేపుతున్నాయి. మన టాలీవుడ్ కి చెందిన హిట్ దర్శకుల్లో ఒకరైనటువంటి దర్శకుడు మారుతి ఇంట్లో ఇప్పుడు తీరని విషాదం నెలకొన్నట్టుగా తెలుగు సినీ మీడియా వారు తెలియజేసారు.
ఇక వివరాల్లోకి వెళ్లినట్టు అయితే దర్శకుడు మారుతి తండ్రి అయినటువంటి దాసరి వన కుచల రావు గారు తన అనారోగ్య మరియు వయసుకు సంబంధించిన సమస్యల రీత్యా నిన్న రాత్రి ఏప్రిల్ 20 న అర్ధ రాత్రికి ముందు కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యింది.
దీనితో టాలీవుడ్ లో వరుసగా ఈ మూడు రోజుల్లో మూడో విషాదం నెలకొంది. మొన్నయికి మొన్న నిర్మాత మరియు బిగ్ డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ నారంగ్, నిన్న వెటరన్ దర్శకుడు తాతినేని రామారావు లు కన్ను మూయగా ఇపుడు దర్శకుడు మారుతి తండ్రి కన్ను మూసారు. దీనితో టాలీవుడ్ లో వరుస విషాదాలతో అన్నీ చేదు వార్తలే వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తలతో ఇతర సినీ ప్రముఖులు తమ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ధైర్యం చెబుతున్నారు. ఇక మారుతీ అయితే రీసెంట్ గా మంచి రోజులొచ్చాయి సినిమాకి దర్శకత్వం వహించగా ఇప్పుడు గోపీచంద్ తో చేసిన “పక్కా కమర్షియల్” సినిమాతో రెడీగా ఉన్నాడు. అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు.