Janhvi Kapoor : బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ బ్యూటీ జాన్వీకపూర్. చేసిన సినిమాలు తక్కువే అయినా, అతిలోక సుందరి కుమార్తె కావడం వల్లనేమో ఆమెకున్న క్రేజ్ ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ అని చెప్పడం అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు.
సినిమాల సంగతెలా వున్నా, ఆ క్రేజ్‌తోనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సెన్సేషన్ అవుతూ వుంటుంది జాన్వీకపూర్. తన ఫాలోవర్స్ అటెన్షన్ ఏమాత్రం మిస్ చేయకుండా ఎప్పటికప్పుడే హాట్ హాట్ ఫోటో పోజులతో రెచ్చిపోతుంటుంది జాన్వీకపూర్.
జాన్వీకి సంబంధించి ఏ చిన్న ముచ్చటయినా అదో పెద్ద సెన్సేషనే. తాజాగా జాన్వీ కపూర్ ప్రేమ ముచ్చట హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో. జాన్వీకపూర్ ప్రేమలో పడిందట. ఓ బాలీవుడ్ యంగ్ స్టర్‌తో జాన్వీ కపూర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయ్.
సినీ కుంటుంబానికి చెందిన వ్యక్తే కానీ, సినిమాల్లో నటించడం లేదట ఆ అబ్బాయ్. అయితే, ఈ విషయమై బోనీ కపూర్, జాన్వీకి వార్నింగ్ ఇచ్చాడట. తిరిగితే తిరగండి కానీ, మీడియా కంటికి మాత్రం చిక్కొద్దు. కెరీర్ నాశనమైపోతుంది.. అని వార్నింగ్ ఇచ్చాడట.
అయితే జాన్వీ మాత్రం అలాంటిదేం లేదు. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే.. అంటోందట. జాన్వీకపూర్‌కి పేద్ద ఫ్రెండ్స్ గ్యాంగ్ వున్న మాట నిజమే. అందులో బాయ్స్ కూడా వున్నారు. అందులోని ఒక ఫ్రెండ్ మాత్రమే అయ్యుంటాడీ అబ్బాయ్ అనుకోవాలా.? లేక నిజంగానే జాన్వీ లవ్వు లీకైందా.? తెలియాల్సి వుంది.