టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మాలిక్ కారు పూర్తిగా ధ్వంసం కాగా, మాలిక్ స్వల్ప గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు.
ఆదివారం రాత్రి తన సహచర క్రికెటర్ వాహబ్ రియాజ్ కారుని ఓవర్టేక్ చేసేందుకు షోయబ్ మాలిక్ ప్రయత్నించగా.. అదుపు తప్పిన అతను స్పోర్ట్స్ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ట్రక్‌ని వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దాంతో.. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోగా.. లగ్జరీ స్పోర్ట్స్ కారు కావడంతో షోయబ్ మాలిక్‌కి ఎలాంటి గాయాలు కాలేదు.
ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన మాలిక్, దేవుని దయతోనే బయటపడ్డానని అన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, స్నేహితులు తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పాడు.
– "I am perfectly all right everybody. It was just a happenstance accident and Almighty has been extremely Benevolent. Thank you to each one of you who've reached out. I am deeply grateful for all the love and care…" ~ Shoaib Malik
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 10, 2021