చరణ్ 15 : జస్ట్ మోషన్ పోస్టర్ కోసం భారీ ఖర్చు పెట్టిస్తున్న శంకర్.??

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఫేమస్ దర్శకుల్లో రాజమౌళితో పాటుగా దర్శకుడు శంకర్ కూడా ఉంటాడు. మరి ఈ ఇద్దరు దర్శకులు సినిమాలు అంటే భారీ మొత్తంలో బడ్జెట్ లు ఉంటాయి. రాజమౌళి సంగతి ఏమో కానీ శంకర్ విషయంలో అయితే ఖర్చు మామూలు రేంజ్ లో ఉండదు.

ప్రతి అప్డేట్ ని కూడా చాలా గ్రాండ్ గా యూనిక్ గా తీసుకెళ్లే ప్రయత్నం తాను చేస్తాడు. మరి అలా ఇపుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ సినిమాని తాను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరి కెరీర్ లో 15వ సినిమా ఇది. పైగా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి 50 వ సినిమా కూడా కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఊహించని టాక్ ఈ సినిమాపై వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఈ సినిమా గ్లింప్స్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గ్లింప్స్ మోషన్ పోస్టర్ టీజర్ కోసం ఇతర సినిమాలకి మహా అయితే 10 లక్షలు కూడా ఖర్చు కాకపోవచ్చు.

కానీ ఈ చిత్రానికి ఏకంగా జస్ట్ ఈ పోస్టర్స్ మరియు టీజర్ కోసం శంకర్ ఏకంగా 3 కోట్లు ఖర్చు పెట్టి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. అయితే ఈ మోషన్ పోస్టర్స్ ని ఈ ఆగస్ట్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు.