హాట్ టాపిక్ గా రామ్ చరణ్ పై శంకర్ తీసిన అదిరే ఈ సీక్వెన్స్.!

Ram Charan : పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ని తెచ్చుకున్న మన టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత నార్త్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఇప్పుడు రామ్ చరణ్ కి ఏర్పడింది. తన తాజా భారీ సినిమా ట్రిపుల్(RRR) తో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరి ఇండియా టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో భారీ సినిమా చేస్తున్నాడు.

వారిద్దరి కెరీర్ లలో 15వ సినిమాగా శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు వైజాగ్ లో షూటింగ్ ని చేసుకుంటుంది. అయితే ఇక్కడ షూటింగ్ మరియు ఇక్కడ తీసిన ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఫ్రై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. తాజాగా శంకర్ రామ్ చరణ్ పై ఒక సాలిడ్ అగ్రెసివ్ సీన్ ని తీసాడట.

ఇది రామ్ చరణ్ కాలేజ్ ఏజ్ లో ఉన్న సన్నివేశం కాగా సినిమాలో బీచ్ రోడ్ దగ్గర ఇది ఉంటుందట. అంతే కాకుండా ఒక ట్రాఫిక్ పోలీస్ తో ఇచ్చే వార్నింగ్ సీన్ ని శంకర్ తన మార్క్ లో అదిరిపోయే రేంజ్ లో తీసారని అంటున్నారు.

దీనితో ఈ ఇంట్రెస్టింగ్ సీన్ సినీ వర్గాల్లో ఇప్పుడు మంచి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం అందిస్తున్నాడు.