చరణ్ సినిమాకి శంకర్ ప్లానింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రెండు సినిమాలు ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత పాన్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా ఇప్పుడు చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇక శంకర్ సినిమాలు అంటే ఏ లెవెల్లో ఉంటాయో కూడా తెలిసిందే. భారీ హంగులకి పెట్టింది పేరు. ఇప్పుడు అలాంటి విజువల్స్ తోనే ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పుడు రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా దీనికి వేసిన ప్లానింగ్స్ వింటే షాక్ అవ్వాల్సిందే. కేవలం ఒక సాంగ్ కోసమే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తుండడమే కాకుండా ఓ భయంకరమైన ఫైట్ సీన్ ని కూడా ప్లాన్ చేసారట. ఇప్పుడు ఆ ఫైట్ సీన్ లోని ఫైటర్స్ వీరు అంటూ కొంతమంది ఆన్ లొకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జస్ట్ ఆ ఫోటో చూస్తే శంకర్ ఏ స్థాయి ఏక్షన్ ని ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక సిల్వర్ స్క్రీన్ పై అవేలా ఉంటాయో చూడాలి.