రామ్ చరణ్ కోసం పెద్ద పెద్ద స్టార్లను దింపుతున్నారు

Shankar grabbing big stars for Ram Charan

Shankar grabbing big stars for Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ఒక పాన్ ఇండియా ఫిలిం చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నటీనటుల ఎంపిక కూడ జోరుగా సాగుతోంది. కథ ప్రకారం సినిమాలో ఒక ప్రత్యేకమైన రోల్ ఉందట. అది కాస్త ఏజ్డ్ క్యారెక్టర్. అంటే 50 ఏళ్ల వయసున్న పాత్ర. ఈ పాత్ర కోసం ఒక్కొక భాష నుండి ఒక్కొక్క నటుడ్ని తీసుకోవాలని చూస్తున్నారు. హిందీ నుండి సల్మాన్ ఖాన్ ను దింపే ప్రయత్నం సాగుతోంది. సాల్మన్ ఎలాగూ చిరు కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉంది.

ఇక తమిళంలో విజయ్ సేతుపతి దింపుతున్నారు. సేతుపతికి ఎలాగూ మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. అందునా శంకర్ దర్శకుడు కాబట్టి ఆయన కూడ ఫిక్స్. కన్నడ నుండి సుదీప్ లేదా ఉపేంద్రను తీసుకునే యోచనలో ఉన్నారు మేకర్స్. ఇక తెలుగులో అయితే చిరు లేదా పవన్ ఆ పాత్ర చేస్తారనే టాక్ నడుస్తోంది. అయితే శంకర్ మాత్రం దాన్ని కూడ రామ్ చరణ్ చేతనే చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటీకే లుక్ టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాని పట్ల శంకర్ సంతృప్తి చెందారు అంటే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం కన్ఫర్మ్ అయినట్టే. మొత్తానికి చరణ్ పాన్ ఇండియా సినిమా కోసం అన్ని భాషల నుండి పెద్ద పెద్ద స్టార్లే దిగుతున్నారన్నమాట.