Ram Charan : క్రేజీ గాసిప్ : రామ్ చరణ్ తో భారీ సినిమాకి మాస్ టైటిల్ ఫిక్స్ చేసిన శంకర్.?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాని ఇండియాలోని టాప్ దర్శకుడు అయినటువంటి రాజమౌళితో చరణ్ చెయ్యగా దీని తర్వాత మరో ఇండియాస్ విజనరీ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా సెన్సేషన్ ని రేపాడు.

మరి శంకర్ సినిమాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. అందుకే ఈ సినిమాపై కూడా భారీ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఇది కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాని ఈ సినిమా నుంచి మేకర్స్ ఈ మార్చ్ లో రామ్ చరణ్ డే కానుకగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఫిక్స్ చేసిన టైటిల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి శంకర్ “సర్కారోడు” అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేసారని ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మన తెలుగు నేటివిటీకి ఇది సరిగ్గా సెట్ అయ్యింది కానీ మరి పాన్ ఇండియా లెవెల్లో ఇదే ఉంటుందా లేదా అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ సినిమా కూడా శంకర్ మార్క్ లోనే ఒక సోషల్ డ్రామాగా తెరకెక్కుతుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.