షారుఖ్ ఖాన్ కన్ను నయనతార మీదనే ఉందట

Shah Rukh Khan eyes on Nayanthara
Shah Rukh Khan eyes on Nayanthara
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  చాన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా చేయలేకపోతున్నందున ఆలోచనలో పడిన షారుక్ లాంగ్ బ్రేక్ తీసుకుని చివరికి సౌత్ దర్శకులైతేనే మంచి మసాలా ఎంటెర్టైనర్ తీయగలరని భావించి అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.  తాజాగా షారుఖ్ ఖాన్ మీద లుక్ టెస్ట్ కూడ జరిగింది. హీరోయిన్ ఎంపిక విషయంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు, ఒక సౌత్ హీరోయిన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. 
 
బాలీవుడ్ నుండి కత్రినా కైఫ్, పరిణీతి చోప్రా, దీపికా పదుకొనెలను సంప్రదించారట. వీరిలో ఎవరో ఒకర్ని తీసుకుంటే హిందీలో మంచి మార్కెట్ ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కాకపోతే షారుక్ ఖాన్ మాత్రం కొత్తదనం కోసం దక్షిణాది హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.  మరి ఆ దక్షిణాది హీరోయిన్ ఎవరు అంటే నయనతార పేరు గట్టిగా వినిపిస్తోంది. నయనతార అయితేనే కొత్తగా ఉంటుందని షారుక్ ఖాన్ భావిస్తున్నారట. ఎంత పారితోషకమైనా ఇచ్చి ఆమెనే సినిమాలోకి తీసుకురావాలని, అప్పుడే తమిళంలోకి డబ్ చేసినా మంచి మార్కెట్ ఉంటుందని అనుకుంటున్నారట.  మొత్తానికి షారుఖ్ దృష్టి సౌత్ హీరోయిన్ మీదనే ఉంది.