హమ్మయ్య.. కీర్తి సురేష్ విషయంలో ఇక భయపడాల్సిన పని లేదా..!?

Keerthy Suresh : ఇతర సినిమా ఇండస్ట్రీలలో ఏమో గాని మన తెలుగు సినిమా దగ్గర మాత్రం సెంటిమెంట్ లని చాలా వరకు అందరూ నమ్ముతారు పాటిస్తారు. అయితే వాటిలో చాలా వరకు అన్నీ నిజాలే ఉండడం కారణం కావచ్చు కానీ ఈ సెంటిమెంట్ లు అయితే మన వాళ్ళని బాగా ఇరుకున పడేస్తాయి. అది సినిమా టైటిల్ లో ఎన్ని అక్షరాలు ఉండాలి అనే దాని నుంచి సినిమా ఫలితం వరకు కూడా హీరో హీరోయిన్ ఒక కాంబినేషన్ ఇలా అన్నింటిలో చూస్తారు.

మరి అలాంటి లేటెస్ట్ సెంటిమెంట్ మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ని భారీ ప్లాప్ గా మార్చింది. దానికి అయితే ఏకంగా రాజమౌళి, పూజా హెగ్డే సెంటిమెంట్ లు కలిసాయి. మరి అలా కొంతకాలంగా మరో హీరోయిన్ సెంటిమెంట్ కి మన వాళ్ళు భయ పడుతున్నారు. ఆమెనే కీర్తి సురేష్. ఈ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నటించిన లాస్ట్ ఏడెనిమిది చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి ప్లాప్ అవ్వడంతో మహేష్ బాబుతో నటించిన భారీ సినిమా “సర్కారు వారి పాట” విషయం లో అందరికీ ఒక డౌట్ ఉండేది.

కాని ఇప్పుడు అయితే ఎవరూ అలా భయపడాల్సిన పని లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు తన ప్లాప్ ల పర్వం నుంచి బ్రేక్ వచ్చి హిట్ తగిలింది. ఇది చాలా మందికి తెలుసో లేదో కానీ ఆమె నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా “చిన్ని” తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. దీనితో ఆమెపై సెంటిమెంట్ బ్రేక్ అయ్యినట్టే అని చెప్పాలి. అంటే ఇక మహేష్ బాబు సినిమాకి ఎలాంటి డోకా లేదని చెప్పాల్సిందే. సో ఇలా మహేష్ బాబు ఖచ్చితంగా భారీ విజయం సొంతం చేసుకోడం ఖాయం అయ్యింది. అయితే ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాల్సిందే.