టాలీవుడ్ లో ఇదే భారీ మల్టీస్టారర్..చిరు – బాలయ్య సినిమా డీటెయిల్స్..!

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్నటువంటి భారీ మల్టీ స్టారర్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా ఈ ఏడాది వచ్చిన మాసివ్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అని చెప్పొచ్చు. ఎందుకు అంటే రెండు పెద్ద ఫామిలీ హీరోలు అందులోని భారీ స్టార్డం ఉన్న హీరోలు ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లు నటించడం మూలాన ఈ చిత్రం పెద్ద మల్టీ స్టారర్ అయ్యింది.

అయితే నెక్స్ట్ ఇంకే సినిమా ఈ రేంజ్ ని మ్యాచ్ చేసేది రాలేదు అనౌన్స్ కాలేదు కానీ దీనిని మించిన భారీ మల్టీ స్టారర్ మాత్రం పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అదే మెగాస్టార్ చిరు మరియు నందమూరి బాలకృష్ణ లతో చేసే మల్టీ స్టారర్. మరి దీనిని అయితే నిర్మాత అల్లు అరవింద్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా బాలయ్య ఆహా షో లో తాను గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో తెలిపారు.

అల్లు అరవింద్ ని మన కాంబోలో ఎప్పుడు సినిమా రాలేదు కదా అని అడగ్గా నాకు అయితే చిరంజీవిని మీతో కలిపి ఓ మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని ఉందని అడగ్గా బాలయ్య అందుకొని అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అని అన్నారు. దీనితో ఆల్ మోస్ట్ ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ అయితే ఆన్ లో ఉన్నట్టే అని చెప్పాలి. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.