తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్న విన్నపం చేసిన కమెడియన్ బ్రహ్మానందం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం. కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారా విజయం సాధించాయి అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన బ్రహ్మానందం ప్రస్తుతం వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో బ్రహ్మానందం చిత్ర బృందంతో కలిసి సరదాగా చాట్ చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ వెంకటేష్ కామెడీ టైమింగ్ తన ఇదివరకే పలు సినిమాలలో చూశానని అయితే హీరో వరుణ్ తేజ్ తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను సందడి చేశారని ఈ సందర్భంగా బ్రహ్మానందం వీరి నటన పై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ఆలీ, రఘు బాబు, వంటి తదితరులు కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి నట్లు బ్రహ్మానందం కొనియాడారు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ మరియు చిత్ర పరిశ్రమలోనూ లేరని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే తెలుగు సినిమాలలో కమెడియన్స్ లేకపోయినా ఫర్వాలేదు… కామెడీ మాత్రం ఉంచండి అంటూ ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈయన చిన్న విన్నపం చేశారు. ఇకపోతే ఎఫ్3 సినిమాలో కూడా తాను నటించాలని అనిల్ తనకు ఫోన్ చేశారని అయితే కరోనా కారణం వల్ల ఈ సినిమాలో నటించే లేకపోయాను అని ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలియజేశారు.