చిరంజీవి కొడుకు కావడంతో రామ్ చరణ్ కి అంత పేరు వచ్చింది.. కోట షాకింగ్ కామెంట్స్!

ఎన్నో తెలుగు సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కోట శ్రీనివాస్ రావు ఒకరు. ఈయన కొన్ని వందల సినిమాలలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇకపోతే ప్రస్తుతం ఈయనకు వయసు పైబడటంతో ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ, ఇండస్ట్రీలోని కొందరి హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు తాజాగా ఆయన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి తరం హీరోలలో ఎంతో మంది అద్భుతంగా నటించేవారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. ఎన్టీఆర్ నటన డాన్స్ అతను డైలాగ్స్ చెప్పే విధానం అన్ని తనకు ఎంతగానో నచ్చుతాయని తన స్థానాన్ని ఎన్టీఆర్ రీప్లేస్ చేశారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు కూడా మంచిగా నటిస్తున్నారని తెలియజేశారు.

ఈ విధంగా వీరి గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన కోట శ్రీనివాస్ రావు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను చేశారు. మెగాస్టార్ అండ ఉండటం వల్ల రామ్ చరణ్ ఇండస్ట్రీలో అంత పేరు సంపాదించుకున్నారని, అతనిలో అంత పొటెన్షియాలీటీ లేదని రామ్ చరణ్ గురించి కోట శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెగా హీరోల గురించి ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రెండు రోజుల క్రితం కోట మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.